CM Chandrababu : జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు పిఠాపురంలో ఘనంగా మొదలయ్యాయి. మరికొద్ది సేపట్లో పవన్ కల్యాణ్ అక్కడకు చేరుకుంటారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జనసేనకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆ పార్టీ ఎదిగిన తీరును అభినందించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. జనసేన ముఖ్యనేతలు, ఎమ్మెల్యేలకు శుభాకాంక్షలు తెలిపారు. పవన్ తో ఉన్న ఫొటోలను పంచుకున్నారు.
Read Also : Janasena : పిఠాపురం జనసేన సభ వద్ద ఉద్రిక్తత..
పిఠాపురంలో ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఏపీలో అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సభ కావడంతో పవన్ ఏం మాట్లాడుతారా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఏపీ రాజకీయాలపై ఆయన కీలక వ్యాఖ్యలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. భవిష్యత్ ప్రకటన కూడా ఉంటుందని అంటున్నారు.