CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా సీఐఐ కార్యక్రమంలో మాట్లాడుతూ.. నవంబర్ 14, 15 రెండు రోజుల పాటు విశాఖపట్నంలో జరిగే “భాగస్వామ్య సదస్సు”కు పెద్ద సంఖ్యలో వాణిజ్య ప్రతినిధుల బృందం రావాలని ఆహ్వానించారు. కేవలం పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించడం లేదు.. సరికొత్త ఆలోచనలను పంచుకునేందుకు పెట్టుబడిదారి ప్రతినిధుల బృందాలు రావాలని పేర్కొన్నారు. ఇక, వ్యాపారం నాకు కొత్తేమీ కాదు.. విశాఖలో ఏడు సార్లు “భాగస్వామ్య సదస్సులు” నిర్వహించడమే నా నిబద్దత ఏమిటో స్పష్టమౌతోంది.. ప్రతి సారి దావోస్ లో జరిగే సదస్సుల్లో పాల్లొంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు.
Read Also: Dimple Hayathi: మరో వివాదంలో హీరోయిన్.. పెళ్లి కూడా అయిపోయిందా?
అయితే, “ఈజీ ఆఫ్ బిజినెస్” విధానంలో ఏపీ అగ్రస్థానంలో కొనసాగుతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. స్వర్ణాంధ్ర ప్రదేశ్-2047 లక్ష్యంగా ఏపీ సమగ్రాభివృద్ధి సాధించాలన్నదే మా ధ్యేయం.. సాంకేతిక (టెక్నాలజీ) ఆధారిత రంగాల అభివృద్ధే ప్రధాన లక్ష్యం అన్నారు. ఇక, అమరావతిలో 2026 జనవరిలో “క్వాంటమ్ కంప్యూటింగ్” ప్రారంభం కానుంది.. ఏపీ 15 శాతం ఆర్థికాభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో పని చేస్తుంది.. అలాగే, భారతదేశంలో సరైన సమయంలో, సరైన రీతిలో, సరైన నాయకత్వం అందిస్తున్న నాయకుడు ప్రధాని నరేంద్ర మోడీ.. ఏపీలో సౌర, గాలి “రెన్యువల్ ఎనర్జీ”కి అద్భుతమైన అవకాశం ఉందని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.
Read Also: Unix Earbuds: డిస్ప్లేతో యునిక్స్ నెక్‌బ్యాండ్ విడుదల.. తక్కువ ధరకే
ఇక, ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఓడ రేవులు ఏపీలో అందుబాటులోకి ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఎంతో వేగంగా పారిశ్రామికీకరణ జరిగే అవకాశం దేశంలో ఉంది.. హైదరాబాద్ ఎంతో నివాసయోగ్యమైన నగరం.. అత్యంత అధిక తలసరి ఆదాయం ఉన్న నగరం హైదరాబాద్.. గతంలో హైదరాబాద్ ను అలా అభివృద్ధి చేసే అవకాశం నాకు లభించింది.. మరో నగరం అమరావతిని కూడా అభివృద్ధి చేసే అదృష్టం నాకు దొరికింది.. ఏపీలో పుష్కలంగా నదీ జలాల లభ్యత ఉందని సీఎం చంద్రబాబు తెలియజేశారు.
