Site icon NTV Telugu

Chandrababu Focuses on TDP: టీడీపీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి..

Chandrababu

Chandrababu

Chandrababu Focuses on TDP: టీడీపీ సంస్థాగత నిర్మాణంపై సీఎం చంద్రబాబు దృష్టి పెట్టారు. రేపు (ఆగస్టు 23న) ఉండవల్లిలోని తన నివాసంలో మంత్రులు, పొలిట్‌బ్యూరో సభ్యులు, కొంత మంది ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఈ మీటింగ్ లో ప్రధానంగా సంస్థాగత ఎన్నికలు, అసెంబ్లీ, పార్లమెంటరీ కమిటీల నియామకం ఎంత వరకు పూర్తయ్యాయన్న అంశాలపై సమీక్ష చేయనున్నారు. అలాగే, రాష్ట్ర కమిటీ ఏర్పాటుపైనా ముఖ్య చర్చ జరిగే అవకాశం ఉంది. అంతేకాకుండా, స్త్రీశక్తి పథకం విజయవంతం చేయడానికి జిల్లాల్లో ఏర్పాటు చేయనున్న ప్రత్యేక సమావేశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నారు.

Read Also: 7,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Redmi Note 15 Pro+, Note 15 Pro స్మార్ట్ఫోన్స్ లాంచ్

అయితే, సెప్టెంబర్ 3వ తేదీన అనంతపురంలో నిర్వహించనున్న “సూపర్ సిక్స్ సూపర్ హిట్” బహిరంగ సభపై కూడా రేపటి సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ సభను మొదట ఈ నెల 25వ తేదీన నిర్వహించాలని భావించినప్పటికీ, కొన్ని కారణాల వల్ల దాన్ని సెప్టెంబర్ 3వ తేదీకి ఫిక్స్ చేశారు. పార్టీ బలమైన సంస్థాగత నిర్మాణం కోసం ఈ సమావేశం కీలకమని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. టీడీపీ భవిష్యత్ కార్యాచరణపై నేతలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేసే ఛాన్స్ ఉంది.

Exit mobile version