Site icon NTV Telugu

CM Chandrababu: నేటి నుంచి సీఎం చంద్రబాబు విదేశీ పర్యటన..

Babu

Babu

CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు మరోసారి విదేశీ పర్యటనకు రెడీ అయ్యారు. ఈరోజు (అక్టోబర్ 21) నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్‌, అబుదాబి, యూఏఈలో పర్యటించనున్నారు. అయితే, నవంబర్ లో విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు విదేశీ పెట్టుబడుదారులను ఆహ్వానించేందుకు ఆయా దేశాల్లో పర్యటించబోతున్నారు. ఈ టూర్ లో భాగంగా రియల్ ఎస్టేట్స్, భవన నిర్మాణం, లాజిస్టిక్స్‌తో పాటు రవాణా, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్నోవేషన్స్ రంగాల్లో పెట్టుబడులకు ఆహ్వానం పలకనున్నారు. ఇక, ఈ విదేశీ పర్యటనకు సీఎం చంద్రబాబు వెనక మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డిలతో పాటు ఆయా శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు వెళ్లే అవకాశం.

Read Also: Nizamabad: సీసీఎస్ కానిస్టేబుల్ హత్య కేసు నిందితుడు రియాజ్ అంత్య క్రియలు పూర్తి..

ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తుంది. రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల అభివృద్ధి కోసం చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటిస్తూ.. రాష్ట్రాభివృద్ధి కోసం వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే సింగపూర్, దావోస్‌లోనూ ఆయన పర్యటించిన సంగతి తెలిసిందే. అలాగే, మంత్రి లోకేష్ కూడా ఏపీలో పెట్టుబడుల కోసం ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్నారు.

Exit mobile version