Minister Anagani: రేపల్లెలోని మున్సిపల్ కార్యాలయంలో తుఫాన్ వరద ప్రభావంపై మంత్రి అనగాని సత్యప్రసాద్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొంథా తుఫాన్ ప్రభావాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి కూటమి ప్రభుత్వం చేసిన కృషి ఒక చరిత్ర.. గత ఆరు రోజులుగా సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్ మైక్రో లెవల్లో పర్యవేక్షించారు.. అనివార్య కారణాల వల్ల రెండు ప్రాణాలు పోయాయి తప్ప ప్రాణ, ఆస్థి నష్టాన్ని పెద్ద ఎత్తున తప్పించాం.. తుఫాన్ కారణంగా ప్రభావితులైన వారికి సీఎం చంద్రబాబు భారీగా సహాయం ప్రకటించారని మంత్రి అనగాని పేర్కొన్నారు.
Read Also: FariaAbdullah : స్విమ్ సూట్ లో ఫరియా.. సెగలు రేపుతుందయ్యా..
అయితే, పంటలకు జరిగిన నష్టాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. హెక్టార్ కు 25 వేల రూపాయల వరకు పరిహారం ఇచ్చే అవకాశం ఉందన్నారు. మత్స్యకారులకు అదనపు సహాయం ఇస్తున్నాం.. ఇళ్లు దెబ్బతిన్న వారిని కూడా ఆదుకుంటాం.. తుఫాన్ సమయంలో కూటమి పార్టీల నేతలంతా బూత్
లెవల్ నుంచి రాష్ర్ట స్థాయి వరకు సహాయ చర్యల్లో పాల్గొన్నారని పేర్కొన్నారు. కానీ, వైసీపీ నేతలు మాత్రం తుఫాన్ వచ్చినప్పుడు కనిపించరని ఎద్దేవా చేశారు. సీఎం చంద్రబాబు వెను వెంటనే తుఫాన్ ప్రాంతాల్లో బాధితుల వద్దకు వెళ్లారు.. కానీ, గత ముఖ్యమంత్రి ఓ స్టేజ్ కట్టించుకొని బాధితులను ఆయన దగ్గరకే రప్పించుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలు, చేస్తున్న సహాయం పట్ల ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
