CJI NV Ramana Visit Today Srisailam Temple.
నేడు కర్నూలు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీశైల పుణ్యక్షేత్రానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ సతీసమేతంగా విచ్చేయనున్నారు. ఆదివారం సాయంత్రం స్వామివారిని, అమ్మవారిని ధూళి దర్శనం చేసుకోనున్నారు. రాత్రి బస చేసి.. సోమవారం ఉదయం స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించున్నారు. అనంతరం కల్యాణోత్సవంలో పాల్గొంటారు. సీజేఐ రాక నేపథ్యంలో ఏపీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కంచిమఠంలో జరిగే హోమ పూర్ణాహుతిలో సీజే ఎన్వీ రమణ దంపతులు పాల్గొననున్నారు.
గత ఏడాది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి తెలుగు రాష్ట్రాలకు వచ్చిన ఆయన అప్పటి నుండి తరచుగా రెండు తెలుగు రాష్ట్రాలలోని పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ.. ఇక్కడ జరిగే కార్యక్రమాలకు కూడా హాజరవుతున్నారు. ప్రస్తుతం కూడా సీజేఐ రమణ తెలుగు రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు.