Site icon NTV Telugu

ఏపీలో సీజేఐ 3 రోజుల పర్యటన.. తొలిసారి స్వగ్రామానికి..!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో పలు సందర్భాల్లో పర్యటిస్తున్న ఆయన.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.. ప్రస్తుతం తెలంగాణలో ఆయన పర్యటన కొనసాగుతుండగా… త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో సీజేఐ పర్యటన కొనసాగనుంది.. సీజేఐగా తొలిసారి తన స్వగ్రామంలో అడుగుపెట్టనున్నారు..

Read Also: దళితబంధు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్‌..

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఏపీలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ 3 రోజుల పాటు పర్యటించనున్నారు.. ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు ఆయన పర్యటన కొనసాగనుంది.. 24నవ తేదీన తన స్వగ్రామం కృష్ణాజిల్లా వీరులపాడు మండలం పొన్నవరంకు వెళ్లనున్నారు ఎన్వీ రమణ.. భారత ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత.. జస్టిస్‌ రమణ.. తన స్వగ్రామానికి వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం.. ఇక, 26న ఏపీ రాష్ట్రస్థాయి న్యాయాధికారుల రెండో సదస్సుకు హాజరుకానున్నారు.. అదే రోజు ఏపీ హైకోర్టును కూడా సందర్శించనున్నారు సీజేఐ జస్టిస్‌ రమణ.

Exit mobile version