Site icon NTV Telugu

CJI NV Ramana: గాంధీ ఆత్మకథలో అన్ని వాస్తవాలే.. సీజేఐ ఎన్వీ రమణ

Cji Nv Ramana

Cji Nv Ramana

సామాన్యుడి మహాత్ముడుగా మారిన గొప్ప వ్యక్తి గాంధీ.. ఆయన ఆత్మకథల్లో అతిశయోక్తులు సాధారణంగా ఉంటాయి.. గాంధీ ఆత్మకథలో అన్ని వాస్తవాలే అన్నారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ.. మహాత్మా గాంధీ జీవిత చరిత్ర సత్యశోదన పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన.. పుస్తకావిష్కరణ అనంతరం మాట్లాడుతూ.. గాంధీజీ రెండుసార్లు తిరుపతికి వచ్చినట్టు చరిత్ర చెబుతోంది.. 1921లో తొలిసారి, 1933లో రెండోసారి వచ్చారని తెలిపారు..

Read Also: Mumbai: కుప్పకూలిన నాలుగంతస్తుల భవనం..

ఇక, దేశ ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో గాంధీ ఆత్మకథ చదవాల్సిన అవసరం ఉందన్నారు సీజేఐ ఎన్వీ రమణ.. గాంధీ వారసులుగా మనం ఉండటం గర్వకారణం అన్నారు.. గాంధీ జీ స్వాతంత్ర తేవడమే కాకుండా నైతికతను నేర్పారని.. యువత గాంధీని మరిచి పోతున్న సమయంలో కరుణాకర్ రెడ్డి సత్య శోధన పునర్ ముద్రించడం గొప్ప విషయం అన్నారు.. గాంధీ జీ మిగిలిన పుస్తకాలను పునర్ ముద్రించలని కోరారు.. విప్లవ భావాల పట్ల నేను విద్యార్థిగా ఉన్నపుడు ఆకర్షితిడిని అయ్యాయనని గుర్తుచేసుకున్నారు సీజేఐ ఎన్వీ రమణ.

ఇక, వైసీపీ ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డిపై ప్రశంసలు కురిపించారు ఎన్వీ రమణ.. రాజకీయాల్లో కరుణాకర్ రెడ్డి నిర్మోహమాటంగా ఉంటూ నెట్టుకు రావడం గొప్ప విషయం అన్నారు.. కరుణాకర్ రెడ్డిని ప్రస్తుత పార్టీ కానీ గతంలో ఉన్న పార్టీ గానీ సరైన రీతిలో ఉపయోగించుకోలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.. నిర్మొహమటంగా ఉండే కరుణాకర్ రెడ్డిని ఎందుకు పెద్ద పదవులు వరించలేదో అర్థం కాలేదన్నారు.. కరుణాకర్ రెడ్డి నాకు ఆత్మీయ సోదరుడు.. తెలుగు మహాసభలను టీటీడీ చైర్మన్ గా కరుణాకర్ రెడ్డి నిర్వహించారు.. మరోసారి తెలుగు మహాసభలు కరుణాకర్ రెడ్డి తిరుపతిలో నిర్వహించాలని కోరుకుంటున్నానన్నారు.. నైతికత తో కూడిన రాజకీయాలు చేసే ఉద్యమానికి కరుణాకర్ రెడ్డి నాయత్వం వహించాలన్నారు ఎన్వీ రమణ.

Exit mobile version