Site icon NTV Telugu

CJI BR Gavai: రేపు విజయవాడకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి.. భారత రాజ్యాంగంపై ప్రసంగం!

Br Gavai

Br Gavai

CJI BR Gavai: రేపు విజయవాడకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా రేపు (నవంబర్ 16న) ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని సీకే కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని ‘ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎట్ 75 ఇయర్స్’ అనే అంశంపై ప్రసంగించనున్నారు. అయితే, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్ల పూర్తైన సందర్భంగా ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా పాల్గొననున్నారు. అలాగే, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, హైకోర్టు న్యాయమూర్తి, ఏపీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్, పలువురు న్యాయవాదులు పాల్గొనే అవకాశం ఉంది.

Exit mobile version