Tirumala Parakamani Case: తిరుమలలో సంచలనం రేపిన పరకామణి కేసు విచారణ పునఃప్రారంభం అయింది. ఈ కేసు దర్యాప్తును సీఐడీ స్టార్ట్ చేసింది. కేసు వివరాలను సమీక్షించడానికి సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యనార్ తిరుమలకు చేరుకోనున్నారు. అయితే, ఆయన వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసుకు సంబంధించిన ఫైళ్లు, సాక్ష్యాలను పరిశీలించనున్నట్లు తెలుస్తుంది. గతంలో పరకామణిలో చోరీకి పాల్పడిన జీయంగార్ గుమస్తా రవికుమార్ ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
Read Also: BC Reservations: సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసిన తెలంగాణ ప్రభుత్వం!
అయితే టీటీడీకి 40 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తులను నిందితుడు రవిశంకర్ కుటుంబం విరాళంగా ఇచ్చింది. ఈ కేసును గతంలో లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నట్లు పోలీసులు తెలియజేశారు. తాజాగా విచారణ పునః ప్రారంభం కావడం వల్ల ఈ కేసు మళ్లీ చర్చనీయాంశంగా మారింది. సీఐడీ డీజీ స్వయంగా విచారణ చేపట్టడం వల్ల మరిన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం.
