Kuppam: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతినిథ్యం వహిస్తోన్న కుప్పం నియోజకవర్గం పరిధిలో ఉన్న కుప్పం మున్సిపాలిటీని తన ఖాతాలో వేసుకుంది టీడీపీ.. చివరి నిమిషంలో చోటు చేసుకున్న అనూహ్య పరిణామాలతో టీడీపీ ఖాతాలోకి కుప్పం మున్సిపల్ చైర్మన్ పీఠం చేరిపోయింది.. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక చివరి నిమిషంలో.. వైసీపీ నుండి టీడీపీ గూటికి చేరుకున్నారు నలుగురు కౌన్సిలర్లు.. దీంతో.. టీడీపీకి మద్దతు తెలిపిన సభ్యుల సంఖ్య 15 మందికి చేరింది.. 6 వార్డు నుంచి ప్రానిథ్యం వహిస్తోన్న వన్నియకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన సెల్వరాజు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.. కుప్పం మున్సిపాలిటీ తమ ఖాతాలో పడడంతో.. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సంబరాలు చేసుకున్నారు కూటమి నేతలు..
Read Also: SSMB : రాజమౌళి మహాభారతం.. ముగ్గురు హీరోలు ఫిక్స్
కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వేళ చివరి నిమిషంలో వైసీపీకి షాక్ ఇచ్చారు కౌన్సిలర్లు.. వైసీపీ నుండి టీడీపీలో చేరారు నలుగురు కౌన్సిలర్లు.. టీడీపీకి 14 మంది కౌన్సిలర్లు మద్దతు తెలపగా.. వైసీపీ నుండి ఎనిమిది మంది కౌన్సిలర్లు మాత్రమే హాజరు అయ్యారు.. మొత్తం 14 కౌన్సిలర్లు.. ఎమ్మల్సీ ఓటు కలసి 15 ఓట్లతో కుప్పం మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికలో విజయం సాధించింది టీడీపీ.. 5వ వార్డుకు చెందిన వన్నియకుల క్షత్రియ సామాజికవర్గానికి చెందిన సెల్వరాజు మున్సిపల్ చైర్మన్ గా ఎన్నికయ్యారు.. దీంతో.. ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో సంబరాలు చేసుకున్నారు కూటమి నేతలు.
