NTV Telugu Site icon

Chittoor District,: డిప్యూటీ సర్వేయర్‌ సస్పెండ్.. ఇప్పుడు రైతు నుంచి.. గతంలో చంద్రబాబు ఇంటి సర్వే కోసం లంచం డిమాండ్‌..!

Suspended

Suspended

Chittoor District: చిత్తూరు జిల్లా శాంతిపురం మండల డిప్యూటీ సర్వేయర్ ఎస్.సద్దాం హుస్సేన్‌ను సస్పెండ్ చేశారు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు.. ఓ రైతు నుంచి సర్వే పని పూర్తి చేయడానికి 1 లక్ష రూపాయలు డిమాండ్ చేశారని డిప్యూటీ సర్వేయర్ పై అభియోగాలు నమోదు చేశారు.. అయితే, రైతు ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు.. అది నిజమేనని నిర్ధారణకు వచ్చారు.. దీంతో.. అతడిపై సస్పెన్షన్‌ వేటు వేశారు జాయింట్‌ కలెక్టర్‌.. మరోవైపు.. గతంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇంటి సర్వే చేయడానికి కూడా లంచం డిమాండ్ చేశాడట సద్దాం.. శాంతిపురం మండలం శివపురం వద్ద ఇంటి నిర్మాణానికి.. చంద్రబాబు నాయుడు గతంలో స్థలాన్ని కొనుగోలు చేశారు.. అది వ్యవసాయ భూమి కావడంతో భూవినియోగ మార్పిడి, సబ్ డివిజన్ కోసం.. టీడీపీ నాయకులు దరఖాస్తు చేశారు.. ఈ సమయంలో 1.80 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేశాడట డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుస్సేన్..

Read Also: ICC T20 World Cup 2024 Team: టీ20 వరల్డ్‌కప్‌ 2024 జట్టు ప్రకటన.. కింగ్ లేకండానే టీమిండియా నుండి ఆరుగురుకు చోటు..

గత కుప్పం పర్యటన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి ఈ విషయాన్ని తీసుకోచ్చిన స్దానిక కుప్పం నేతలు.. ఆ తర్వాత ఓ రైతు పొలం సర్వే చేయడానికి లంచం డిమాండ్‌ చేయడం.. ఆ రైతు అధికారులకు ఫిర్యాదు చేయడం.. విచారణలో అది నిజమేనని తేలడంతో.. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో.. డిప్యూటీ సర్వేయర్‌ను సస్పెండ్‌ చేశారు చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు.

Show comments