Site icon NTV Telugu

Peddireddy Ramachandra Reddy: చంద్రబాబుపై పెద్దిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. కుట్ర పన్ని మెడికల్ కాలేజీ భూముల విక్రయం..!

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy

Peddireddy Ramachandra Reddy: ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై మాజీ మంత్రి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.. చిత్తూరు జిల్లా పుంగనూరులో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ర్యాలీ నిర్వహించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి.. తహసీల్దార్ కు వినతిపత్రం అందజేశారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై ఫైర్‌ అయ్యారు.. చంద్రబాబు కుట్ర పన్ని లక్షల, కోట్లు విలువచేసే మెడికల్ కాలేజీల భూముల్ని వంద రూపాయలకు విక్రయిస్తున్నాడని ఆరోపించారు.. 50 ఎకరాల మెడికల్ కాలేజీల భూముల వల్ల రాష్టానికి లక్షల కోట్ల ఆదాయం వస్తుంది.. పేద విద్యార్థులు డాక్టర్లు అవ్వడానికి అవకాశం ఉంటుంది.. కానీ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల దాదాపు 2,150 మెడికల్‌ సీట్లు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు..

Read Also: Samantha : కొత్త ప్రయాణం మొదలైంది అంటూ సామ్ పోస్ట్ వైరల్ ..

పులివెందులలో 50 సీట్ల మెడికల్ కాలేజ్ పూర్తయినా చంద్రబాబు నాయుడు అడ్డుకుని నేషనల్ కౌన్సిల్‌కు లేఖ రాశారని మండిపడ్డారు పెద్దిరెడ్డి.. వైద్యం అందించడానికి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డి.. నాడు- నేడు కింద హాస్పిటల్స్, స్కూల్స్ కు వేల కోట్ల ఖర్చు చేశారు.. కానీ, అవన్ని ఇప్పుడు మూలన పడిపోయాయి. 17 మెడికల్ కాలేజీలు వస్తే ప్రతి సంవత్సరం 4,500 సీట్లు అదనంగా వస్తాయి.. 5 సంవత్సరాలలో 30 వేల నుంచి 40 వేల మంది ప్రతి సంవత్సరం వైద్య, విద్య అభ్యసిస్తారు.. ఇలాంటి దాన్ని కుట్రపూరితంగా చంద్రబాబు నాయుడు అతని కుటుంబ సభ్యులు, మంత్రులు డబ్బు ఆశతోనే ఇలాంటి కుట్ర చేస్తున్నారని విమర్శించారు..

చిన్న దేశమైన క్యూబా కరోనా సమయంలో ప్రపంచానికే వైద్య పరంగా సేవలందించింది.. దాదాపు 60 రాష్ట్రాల్లో ఉచిత సేవ అందించారు.. అదే విధంగా మనదేశంలో కూడా కరోనా సమయంలో క్యూబా డాక్టర్లు వచ్చి వైద్య సేవలందించారు.. క్యూబా దేశంలో డాక్టర్లకు ఉచితంగా సీట్లు ఇవ్వడంతో ప్రపంచవ్యాప్తంగా వారు సేవలందించారని గుర్తుచేశారు పెద్దిరెడ్డి.. అయితే, సీఎం చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలు డొనేషన్ ఇచ్చేవారికి అమ్ముకుంటున్నాడు.. ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి వచ్చి డాక్టర్ కోర్సులు చేసుకొని వెళ్లిపోతారు.. ఇలాంటి డాక్టర్లతో మన దేశానికి ఉపయోగం ఉండదు అని వ్యాఖ్యానించారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి..

Exit mobile version