NTV Telugu Site icon

Minister Lokesh: అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర..!

Lokesh

Lokesh

Minister Lokesh: అప్పుడు యువగళం… ఇప్పుడు దండయాత్ర.. అని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్.. యువగళం 100 కిలో మీటర్లు పూర్తయిన సందర్భంగా ఇచ్చిన తొలి హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన వంద రోజుల్లోనే గ్రామప్రజల ఆనందోత్సాహాల నడుమ చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో కిడ్నీ డయాలసిస్ సెంటర్‌ను ప్రారంభించడం సహా పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. యువగళం పాదయాత్ర సందర్భంగా జిల్లా ప్రజలు తనపై చూపిన అభిమానాన్ని జీవితంలో మరువలేను అన్నారు.. యువగళాన్ని అడ్డుకునేందుకు ఆరోజున ఇదే బంగారుపాళ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులు ఎంత అరాచకం సృష్టించారో మీరంతా కళ్లారా చూశారు. నా పాదయాత్రను అడ్డుకునేందుకు జీవో 1 విడుదలచేసి, ఇదే బంగారుపాళ్యంలో నా ప్రచారరథాన్ని నాటి పోలీసులు అడ్డుకుని నా గొంతునొక్కాలని విఫలప్రయత్నం చేశారు. కానీ, వారి ప్రయత్నాలు విఫలం అయ్యాయి.. యువగళం దిగ్విజయం అయ్యిందన్నారు.. యువగళం అన్నది నా ఒక్కడి గొంతు కాదు… 5 కోట్ల మంది ప్రజల గొంతుక అని వారికి తర్వాత అర్థమైంది. ఎన్ని అడ్డంకులు సృష్టించినా యువగళాన్ని ఆపడం వారి తరం కాలేదని వ్యాఖ్యానించారు మంత్రి నారా లోకేష్‌. కాగా, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. తొలిసారి చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్..

Read Also: Land For Job Case: లాలూ యాదవ్‌పై కేసు నమోదు.. సీబీఐకి హోం మంత్రిత్వ శాఖ అనుమతి

కుప్పం నియోజకవర్గం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభం అయ్యింది.. 11 జిల్లాలు.. 97 నియోజకవర్గాలు.. దాదాపు 2 వేల గ్రామాలు.. 3132 కిలోమీటర్ల పాదయాత్ర నేను చేశాను అని గుర్తుచేసుకున్నారు మంత్రి నారా లోకేష్‌.. ఇక నన్ను అడ్డుకోవడానికి నాపై 23 కేసులు పెట్టారని మండిపడ్డారు.. అప్పుడే చెప్పా.. ఈ లోకేష్ తగ్గేదే లేదని.. ఈ రోజు గర్వంగా చెబుతున్నా.. అదే బంగారుపాళ్యంలో నిలిచోని ఉన్నాను.. ఆ రోజు ఏ బిల్డింగ్‌పై ఉంటే ఇబ్బంది పెట్టారో.. ఆ భవనంతో ఈ రోజు సెల్ఫీ తీసుకున్నాను.. ఈ ఊరిని నేను ఎప్పటికీ మర్చిపోలేను.. ఈ ఊరికి ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నాను.. మా ప్రభుత్వం వచ్చి 100 రోజుల్లో ఈ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు మంత్రి నారా లోకేష్..