NTV Telugu Site icon

బ్రేకింగ్: చంద్రగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏడుగురు దుర్మరణం

చిత్తూరు జిల్లాలో రహదారులు రక్తమోడాయి. చంద్రగిరి మండలం ఐతేపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు దుర్మరణం పాలయ్యారు. డివైడర్ ఢీకొనడంతో ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ప్రమాద ఘటనతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి. వేగంగా వెళుతూ డివైడర్ ఢీకొట్టారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా వుంది. వారిని చికిత్స కోసం రుయా ఆసుపత్రికి తరలించారు.

కాణిపాకం నుంచి తిరుపతికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరణించిన వారు విజయనగరం,శ్రీకాకుళం జిల్ల్లాలకు చెందినవారిగా గుర్తించారు. పాలలపాటి జయశేఖర్ రెడ్డి, పైడి హైమావతి, పైడి గోవిందరావు, కంచరపు సురేష్ కుమార్, పైడి మీనా, కంచరపు శ్రీరామమూర్తి, కంచరపు సత్యవతిగా గుర్తించారు. రెండేళ్ళ జిషిత ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే వుంది.