Naga Babu: చిత్తూరు జిల్లా పుంగనూర్ నియోజకవర్గంలో జనంలోకి జనసేన బహిరంగ షభలో పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు పాల్గొ్న్నారు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. ఆరు నెలలు అయ్యింది కూటమీ ప్రభుత్వం వచ్చి.. అప్పుడే పథకాలు రాలేదంటూ మాట్లాడుతూ వైసీపీ గూండాలకు, కుక్కలకు, సన్యాసులకు బుద్దుండాలని విమర్శించారు. రూ 4 వేల పింఛన్, దీపం పథకం కింద ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం.. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల్లో రోడ్లు వేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఉద్యోగాల కల్పనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశాం.. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేశాం.. 48 గంటలకు రైతులకు డబ్బులను అకౌంట్స్ లో వేస్తున్నాం.. విశాఖ ఉక్కుకు నిధులు వచ్చాయి.. గంజాయి డ్రస్ పై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశాంం.. అన్నా క్యాంటిన్లు తిరిగి ప్రారంభించాం.. ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తూ వస్తున్నామని నాగబాబు తెలిపారు.
Read Also: Annamaya District: గడికోట శ్రీకాంత్ రెడ్డికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కౌంటర్..
ఇక, పెద్దిరెడ్డికే కాదు జగన్ వాళ్ళు నాన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డికే భయపడలేదు అని నాగబాబు అన్నారు. పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి ఎవరు అయితే మాకెంటీ.. రాయలసీమలో 23 వేల ఎకరాలు దోచుకున్నారు.. తన అనుచరులతో పెద్దిరెడ్డి సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్దం చేయించాడని ఆరోపించాడు. శివశక్తి డైరీలో పాల ధరను ఇష్టం వచ్చినట్లు పెంచి రైతులను దోచుకున్నారు.. వడమాలపేటలో గుజరాతీ వ్యాపారానీ బెదిరించి ఆస్తులు లాక్కున్నారు.. మద్యం మూత్రంలా ఉందన్న ఓక దళితుడుని చంపేశారు.. మంగళంపేటలో 75 ఎకరాలు దోచుకుని గెస్ట్ హౌస్ నిర్మించాడు.. ఎర్రచందనం అక్రమ రవాణా కోసం ప్రభుత్వ నిధులతో రోడ్డు వేసుకున్నాడు.. అడవి దోంగ పెద్దిరెడ్డి అని పేర్కొన్నారు. రెండు లక్షల కోట్లు అవినీతీ డబ్బును సంపాదించాడు.. రాష్ట్ర బడ్జెట్ దాటిపోయింది వాళ్ళు పెద్దిరెడ్డి అక్రమ సంపాదన.. శాసనసభకు రాకుండా ఉన్న పెద్దిరెడ్డికి ఎందుకు ఎమ్మెల్యే పదవీ ఇచ్చారని జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రశ్నించాడు.
Read Also: Kejriwal: బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం.. గూండాయిజం చేస్తోందని ఆరోపణలు!
అలాగే, పెద్దిరెడ్డి, జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకు అసెంబ్లీ రారు అని జనసేన నేత నాగబాబు అడిగారు. ఏమాత్రం సిగ్గు ఉన్న అసెంబ్లీకి రండీ.. వైసీపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ రావాలంటే భయం.. పెద్దిరెడ్డి అక్రమాలు అన్ని బయటకు తీస్తాం.. కూటమి కార్యకర్తలు ఓపిగ్గా ఉండడం వైసీపీ నేతలందరి మీదా చర్యలు ఉంటాయన్నారు. ఇక, జగన్, పెద్దిరెడ్డి, ద్వారంపూడి సహా అందరినీ మెడపట్టి లోపలికి తోస్తామని ఆయన చెప్పుకొచ్చారు. గెలుస్తే ఏదో చేస్తామని అంటున్నారు.. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిస్తే కధ పెద్దిరెడ్డి నువ్వు ఎదో చేసేది.. మీరు ఏమైనా రామరాజ్యాన్ని నడిపారా.. రావణ రాజ్యాన్ని నడిపారంటూ నాగబాబు ఆరోపించారు.