NTV Telugu Site icon

Kanipakam: వినాయకుడి సన్నిధిలో చవితి వేడుక.. 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు..

Kanipakam Vinayaka

Kanipakam Vinayaka

Kanipakam: చిత్తూరు జిల్లా కాణిపాకంలో స్వయంభు శ్రీ వరసిద్ధి వినాయక సన్నిధి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. విద్యుద్దీపాలతో వినాయకుడు వెలుగుతున్నాడు. రారండోయ్ వేడుక చూద్దాం అంటూ వినాయక చవితి సంబరంతో సందడి నెలకొంది. గణనాథుని ఆలయంలో 21 రోజుల పాటు జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు భద్రత కల్పించడంతోపాటు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవాదాయ శాఖ విస్తృత ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి పెద్దిరెడ్డి.

గణనాథుని బ్రహ్మోత్సవం
చిత్తూరు జిల్లా కాణిపాకం దేవస్థానం, సత్య వాకుల సన్నిధి వినాయక చవితి వేడుకలతో భక్తులను ఆకట్టుకుంటోంది. వినాయక చవితి పండుగతో ప్రారంభమై 21 రోజుల పాటు గణనాథుని బ్రహ్మోత్సవాలు జరగనుండగా ఈ మేరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబరు 8 వరకు జరిగే శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు దేవస్థానం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.అక్టోబర్ 8న తెప్పోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి. జ్ఞానదేవుడు విజ్ఞేశ్వరుని దర్శనానికి వచ్చే భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేశారు. ధ్వజస్థంభంతో పాటు రాజగోపురం ద్వారాలను శుభ్రం చేసి ఆలయాన్ని సిద్ధం చేసి భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూలను ఏర్పాటు చేశారు.

ఆర్జిత సేవల రద్దు
వినాయక చవితి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు ఆలయ అర్చకులు దంపతుల ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. అనంతరం మూడున్నర గంటల నుంచి భక్తులకు స్వామివారి సర్వ దర్శనం కల్పించిన దేవస్థానం ఈ మేరకు ఆర్జిత సేవలన్నింటినీ రద్దు చేసింది. వీఐపీల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వికలాంగులు, వృద్ధులు, శిశువుల తల్లుల కోసం ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేశారు. కాణిపాకం ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాల్లో సర్వాంగ సుందరంగా అలంకరించిన దేవస్థానం యథావిధిగా గణపతి హోమం నిర్వహించనుంది. వినాయక చవితి రోజు గంధం అలంకారంతో దర్శనం ఇవ్వనున్న గణేశుడిని గణేష్ మాలలు ధరించిన భక్తులు దర్శించుకుంటారు. సాయంత్రం భక్తులు పుష్పకవిడి సమర్పిస్తారు. అదే రోజు రాత్రి హంస వాహనంపై గణనాథుడు భక్తులకు దర్శనం ఇచ్చేందుకు వెళ్తుండగా బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు లక్షలాది లడ్డూ ప్రసాదాలను దేవస్థానం సిద్ధం చేసింది. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూ కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని దర్శించుకుంటే కష్టాలు తొలగుతాయని, ఆశీస్సులు లభిస్తాయని ఆలయ ఉప ప్రధాన అర్చకులు సోమశేఖర్ గురుకుల భక్తుల విశ్వాసం అన్నారు.
Bus Accident: లోయలో పడిపోయిన బస్సు.. 25 మంది మృతి, 34 మందికి గాయాలు!