NTV Telugu Site icon

AP Crime: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లో లక్షలు పోయాయి.. ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్యాయత్నం

Online Betting

Online Betting

AP Crime: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ పుణ్యమా అని ఇప్పటికే ఎంతో మంది ప్రాణాలు తీసుకున్నారు.. కొన్ని కుటుంబాలు శాసనం అయ్యాయి.. అయినా.. ఈ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లు నడుస్తూనే ఉన్నాయి.. ఎంతోమంది జీవితాలతో చెలగాటం ఆడుతున్నాయి ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌లు.. పోలీసులు హెచ్చరిస్తున్నా.. సన్నిహితులు వారిస్తున్నా.. కొందరు దాని బారిన పడి పెద్ద ఎత్తున డబ్బులు పోగొట్టుకుంటూనే ఉన్నారు.. ఇక, ఈ రోజు చిత్తూరు జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నం చేశారు.. ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తోంది.

Read Also: Supreme Court: ప్రభుత్వంపై జర్నలిస్టులు విమర్శలు చేస్తే క్రిమినల్ కేసులు పెట్టొద్దు

చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధిచిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. గంగాధర నెల్లూరు గ్రామానికి చెందిన నాగరాజా రెడ్డి కుటుంబం శుక్రవారం ఇంటిలో పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో కుమారుడు దినేష్ (22), భార్య జయంతి (45), కుమార్తె సునీత (26) నలుగురు కలిసి ఇంటిలో పురుగుల మందు సేవించాడు నాగరాజు రెడ్డి అనే వ్యక్తి.. కొద్దిసేపటి తర్వాత అరుపులు విన్న గ్రామస్తులు 108కు సమాచారం ఇవ్వడంతో వీరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడ పరిస్థితి విషమించడంతో తమిళనాడు వేలూరు సీఎంసీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.. ఈ ఘటనకు ప్రధాన కారణం నాగరాజు రెడ్డి కుమారుడు దినేష్.. ఆన్‌లైన్‌ యాప్‌లలో బెట్టింగ్‌కు అలవాటుపడిన దినేష్‌.. లక్షల్లో పోగొట్టుకున్నాడు.. ఎవరు ఇస్తే.. వారి దగ్గర అన్నట్టుగా అప్పులు చేశాడు.. బెట్టింగ్‌ ద్వారా సుమారు 30 లక్షలు పోగొట్టుకున్నడు.. దీనితో నాగరాజు రెడ్డి కుటుంబం అప్పులపాలు అయ్యింది.. ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన నాగరాజు రెడ్డి.. మొత్తం కుటుంబ మొత్తం ఆత్మహత్య చేసుకోవాలని భావించారు.. అందులో ఇంటిలోని నలుగురు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది పోలీసులకు తెలిపారు స్థానికులు.