Site icon NTV Telugu

Cheating: చిట్టీల పేరుతో చీటింగ్.. నరసరావుపేట పీఎస్ ఎదుట ఆందోళన

Chiffund

Chiffund

ఈజీమనీకి అలవాటు పడుతున్నారు కొందరు. కష్టపడకుండా ఎదుటివారిని ఎలా మోసం చేయాలా అని ఆలోచిస్తూ.. జనాన్ని అడ్డంగా ముంచేస్తున్నారు. చిట్టీల పేరుతో లక్షలు డబ్బులు కట్టించుకుని తీరా డబ్బులడిగితే ఉడాయిస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి నరసరావుపేట 2టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చిట్టీల పేరుతో మల్లేశ్వరరావు అనే అతను మోసం చేశాడంటూ పోలీస్ స్టేషన్ ఎదుట మహిళలు ఆందోళనకు దిగారు. మల్లేశ్వరావు అనే చీటీపాటల నిర్వాహకుడు తమకు డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నారని ఆందోళన చెందుతున్నారు మహిళలు.

Jagtial Crime: కిడ్నాప‌ర్ల చెరలో తండ్రి .. 15లక్ష‌లు ఇస్తేనే..

మల్లేశ్వరావు పై పోలీసులకు ఫిర్యాదు చేశారు మహిళలు. రెండు రోజుల క్రితం ఐపీ నోటీసులు ఇచ్చాడు మల్లేశ్వరరావు. కొన్నేళ్లుగా మల్లేశ్వరావు వద్ద నమ్మకంగా చీటీపాటలు వేస్తున్నారు బాధితులు. చిట్టీలు పాడుకున్నా తమకు డబ్బులు ఇవ్వడం లేదని బాధితులు వాపోయారు. తమకి 80 లక్షలకు పైగా నగదు ఇవ్వాలని వాపోతున్నారు మహిళలు. ప్రస్తుతం 2టౌన్ పోలీసుల అదుపులో ఉన్న మల్లేశ్వరరావు వున్నారు. మల్లేశ్వరరావు నుంచి తమ డబ్బులు తమకు ఇప్పించాలని మహిళలు కోరుతున్నారు. పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేపట్టడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈమధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయి. బంధువులనో, ఇంటి పక్కన చాలాకాలంగా వుంటున్నారనో చిట్టీలు వేసి పాడుకున్న డబ్బులు కూడా పదిరూపాయల వడ్డీ ఇస్తారని వారి దగ్గర వుంచుకోవడం, వారు అడ్డంగా మోసం చేయడంతో లబోదిబో మంటున్నారు బాధితులు. ఇలాంటి మోసాలకు అంతం ఎప్పుడో?

Bimbisara: ఓ యుద్ధం మీద పడితే ఎలా ఉంటుందో చూస్తారు

Exit mobile version