NTV Telugu Site icon

Chintha Mohan: మచ్చలేని నేత సంజీవయ్య

మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య శత జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతున్నాయి. తిరుపతిలో కేంద్ర మాజీ మంత్రి , కాంగ్రెస్ సీనియర్ నేత చింతామోహన్ దామోదం సంజీవయ్య శత జయంతి సందర్భంగా నివాళులర్పించారు. తెలుగు ప్రజలకు ముఖ్యమంత్రిగా దామోదరం సంజీవయ్య చేసిన సేవలను శ్లాఘించారు.

ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దామోదం సంజీవయ్య ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు చింతా మోహన్. వృధ్ధాప్య ఫించన్లు, అవినీతిపై ప్రత్యేక చట్టం, బలిజ ,కాపులకు రిజర్వేషన్లు ఇచ్చిన మొట్టమొదటి వ్యక్తి…ఉమ్మడి ఏపీకి తొలి దళిత సీఎం దామోదరం సంజీవయ్య అన్నారు చింతా మోహన్. జగన్ పాలనపై మండిపడ్డారు. అప్పుల ఊబిలో ఏపీ సర్కార్ మునిగిపోయిందన్నారు. వాహనాలకు పెట్రోల్ బిల్లులు చెల్లించలేని స్థితిలో జిల్లా కలెక్టర్ కార్యాలయాలు ఉన్నాయన్నారు. గత రెండేళ్లుగా స్కాలర్ షిప్ లు ఇవ్వలేని ఏపీ సీఎంకి కొత్త జిల్లాల ఏర్పాటు అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నెహ్రూ కుటుంబాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ తక్కువ చేసి మాట్లాడడం ఆయన దిగజారుడు తనానికి నిదర్శనం అని దుయ్యబట్టారు.