NTV Telugu Site icon

Chicken Price In AP: ఏపీలో చికెన్ ధరలపై ఫ్లడ్స్ ఎఫెక్ట్.. కిలో కోడికూర రూ. 270

Chicken

Chicken

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలు చికెన్ రేట్ల పై ప్రభావం చూపిస్తున్నాయి. గడిచిన మూడు వారాలుగా చికెన్ ధరలు భారీగా పెరిగిపోయాయి. రిటైల్ మార్కెట్లో కేజీ 250 నుంచి 270 రూపాయల వరకు పలుకుతుంది. ధరలు పెరగడంతో చికెన్ అమ్మకాలు సగానికి సగం తగ్గాయి. అమ్మకాలు తగ్గినా చికెన్ కు భారీగా డిమాండ్ పెరిగింది. విజయవాడ ప్రాంతంలో వరదల్లో భారీగా కొట్టుకుపోయిన కోళ్లు, కోళ్ల ఫారాలు.. ఇతర జిల్లాల పౌల్ట్రీల నుంచి విజయవాడ ప్రాంతానికి తీసుకోస్తున్న కోళ్లు.. దసరా నవరాత్రులు ప్రారంభమైతే చికెన్ రేట్లు తగ్గే అవకాశం ఉందంటున్న మార్కెట్ వర్గాలు.. చికెన్ ధరలు పెరిగిపోవడంతో మాంసాహారుల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Read Also: IPL 2025 Retention: ఐపీఎల్ 2025 మెగా వేలం.. రిటెన్షన్‌ లిస్ట్‌ డెడ్‌లైన్ డేట్ ఇదే!

మరోవైపు వరద ప్రభావం పేరుతో మార్కెట్లో నిత్యావసరాలు, కూరగాయల ధరలు పెరుగుతున్నాయి. గుంటూరులో గడిచిన కొద్ది రోజులుగా చికెన్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఈనెల ఆరంభంలో 200 రూపాయలు పలికిన చికెన్, ఇప్పుడు 270 రూపాయలు పలుకుతుంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పౌల్ట్రీలలో కోళ్ల సరఫరాను పెంచారు.