సండే వచ్చిందంటే చాలేసారి నాన్‌వెజ్ ప్రేమికులు చికెన్, మటన్ షాపుల వద్ద క్యూ కట్టి రుచికరమైన వంటకాలు చేసుకునేందుకు పరిగెడుతుంటారు. వారంతా ఉద్యోగాలతో బిజీగా గడిపి, ఆదివారం నాన్‌వెజ్ విందుతో రిలాక్స్ అవుదామని అనుకునే వాళ్లకు ఈసారి చిన్న నిరాశ ఎదురైంది. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు గణనీయంగా పెరిగాయి.
హైదరాబాద్‌లో స్కిన్‌లెస్ చికెన్ ధర కిలో 260 రూపాయలకు చేరుకోగా..రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో కూడా దాదాపు ఇదే ధర కొనసాగుతోంది.ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, చిత్తూరు జిల్లాల్లో చికెన్ ధర కిలో 240 నుంచి 260 రూపాయల వరకు ఉంది.కర్నూలు, నంద్యాల, ఏలూరు జిల్లాల్లో చికెన్ ధర 220 నుంచి 230 రూాపాయల మధ్య పలుకుతోంది.
తెలుగు రాష్ట్రాల్లో మటన్ ధర ఇప్పటికీ అధికంగానే ఉంది.కిలో మటన్ ధర రూ.800 రూపాయల నుంచి 900 రూపాయల వరకు అమ్ముతున్నారు.కొన్ని ప్రాంతాల్లో మాత్రం మటన్ ధర రూ.700 రూపాయల కూడా అమ్ముతున్నారు. గుడ్ల ధర రిటైల్ మార్కెట్లో కోడిగుడ్డు ఒక్కటి 7 నుంచి 9 రూపాయల వరకు అమ్ముతున్నారు.