NTV Telugu Site icon

Chanrababu Sensational Comments Live: గెలిపించకపోతే రాజకీయాలకు గుడ్ బై

Maxresdefault

Maxresdefault

Live: గెలవకపోతే ఇవే చివరి ఎన్నికలు: Chandrababu Sensational Comments | Ntv Live

చంద్రబాబునాయుడు బాగా ఎమోషనల్ అయ్యారు. కర్నూలు జిల్లా పర్యటనలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు బాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తనకు చివరి ఎన్నికలు అంటూ వ్యాఖ్యానించారు. నిన్న కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో… మీరు గెలిపించి అసెంబ్లీకి పంపితే సరే, లేకపోతే ఇదే నాకు చివరి ఎన్నిక అని ఆయన అన్నారు. అసెంబ్లీలో నన్ను అవమానించారు.. నా భార్యను కూడా అవమానించారు.. ఇది గౌరవ సభ కాదు.. కౌరవ సభ.. నేను కౌరవ సభను గౌరవ సభ చేస్తానని పేర్కొన్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని తెలిపారు. రాష్ట్రంలో సైకిల్ గాలి వీస్తోందన్నారు.