NTV Telugu Site icon

SI Cheating: ఎస్సై ప్రేమ వంచ‌న‌కు యువ‌తి బ‌లి

Si Vijay Kumar

Si Vijay Kumar

ఆడ‌వారిపై ఎటువంటి అఘాయిత్యాలు జ‌ర‌గ‌కుండా ప‌క‌డ్బందీగా చ‌ర్య‌లు ప్ర‌భుత్వాలు తీసుకుంటున్నా ఫ‌లితం సూన్యంగా మారుతోంది. మ‌హిళ‌ల‌కు ఏదైన ఇబ్బందులు ఎదురైతే ర‌క్ష‌ణ క‌వ‌చ‌లంగా వుండాల్సిన ర‌క్ష‌భ‌టులే మోసాల‌కు పాల్ప‌డుతున్నారు. ఇటువంటి ఘ‌ట‌నే అనంతపురం జిల్లా పామిడి మండ‌లం జీ.ఏ కొట్టాల గ్రామంలో చోటుచేసుకుంది.

ఇక వివరాల్లోకి వెళితే ..

అనంతపురం జిల్లా పామిడి మండలంలోని జీ.ఏ కొట్టాల గ్రామానికి చెందిన బీమ్లా నాయక్ కుమారుడు విజయ్ కుమార్ నాయక్ ప్రస్తుతం చిత్తూరు జిల్లా చంద్రగిరి ఎస్సై గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో జీ.ఏ కొట్టాల గ్రామానికి చెందిన తిరుపాల్ నాయక్ కుమార్తె సరస్వతి అనే యువతి తిరుపతిలోని ఓ కళాశాలలో డిగ్రీ చదువుతూ ఉండేది. అయితే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అయితే గత కొద్ది రోజుల క్రితం వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. రెండు రోజుల క్రితం మనస్థాపం చెందిన సరస్వతి స్వగ్రామంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం చికిత్స పొందుతూ అనంతపురం ఆస్పత్రిలో మృతి చెందింది. తన ఆత్మహత్యకు ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ కారణమంటూ ఫిర్యాదు చేసి చనిపోయింది. దీంతో ప్రియురాలు ఆత్మహత్యతో ఎస్సై బండారం బయటపడింది.

అంతేకాకుండా గత ఏడాది ఎస్ఐ విజయ్ కువకు నాయక్ అనంతపురం కు చెందిన భారతి అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా ప్రేమ వివాహమే… అప్పట్లో భారతీ తనను ప్రేమించి మోసం చేశాడంటూ అనంతపురం దిశా పోలీస్ స్టేషన్ లో విజయ్ కుమార్ నాయక్ పై డిఎస్పి ఆర్ల శ్రీనివాసులకు ఫిర్యాదు చేయడంతో దిశ పోలీస్ స్టేషన్ లో విజయ్ కుమార్ నాయక్ కు కౌన్సిలింగ్ ఇవ్వడంతో విజయ్ కుమార్ పెళ్లికి అంగీకరించాడు. దీంతో పెద్దల సమక్షంలో ఇరువురికి పెళ్లి జరిపించారు. పెళ్లి అయినా ఎస్ఐ విజయ్ కుమార్ నాయక్ లో ఎలాంటి మార్పు రాలేదు. ఎస్ఐ ఉద్యోగం రాక ముందు కూడా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయంలో పని చేసే వాడని అప్పట్లో ఓ మహిళా కానిస్టేబుల్ ను ప్రేమ పేరుతో మోసం చేసినట్టు కూడా తెలుస్తోంది.

కాగా.. మృతురాలు సరస్వతి తండ్రి తిరుపాల్ నాయక్ ఫిర్యాదు మేరకు 376, 420, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పామిడి పోలీసులు. ఎస్.ఐ.విజయ్ కూమార్ నాయక్ ను అదుపులో తీసుకుని విచ‌ర‌ణ చేప‌ట్టిన‌ట్టు తాడిపత్రి డిఎస్సీ చైతన్య తెలిపారు.