Site icon NTV Telugu

Chandra Babu: అక్రమ మైనింగ్‌పై సీఎస్ సమీర్‌ శర్మకు లేఖ

Chandrababu

Chandrababu

ఏపీలోని పలు ప్రాంతాల్లో మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. ఈ మేరకు కుప్పం నియోజకవర్గంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంలో ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయలంటూ సీఎస్ సమీర్‌శర్మకు ఆయన లేఖ రాశారు. కుప్పంలో జరుగుతున్న గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై గతంలో ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలను సీఎస్‌కు రాసిన లేఖకు చంద్రబాబు జత చేశారు.

చిత్తూరు జిల్లాలోని శాంతిపురం మండలం ముద్దనపల్లిలో సర్వే నంబరు 104తో పాటు 213లో అక్రమ మైనింగ్‌పై జాతీయ‌ గ్రీన్ ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సీఎస్ సమీర్ శర్మకు రాసిన లేఖలో చంద్రబాబు గుర్తుచేశారు. గ్రానైట్ అక్రమ మైనింగ్‌పై ఎన్జీటీ ఇచ్చిన అదేశాలను తక్షణమే అమలు చేయాలని సీఎస్‌ను కోరారు. పటిష్టమైన చర్యలతో అక్రమ మైనింగ్‌ను అడ్డుకోవాలన్నారు. ముద్దనపల్లిలో అక్రమ మైనింగ్‌ను ఎన్జీటీ నిర్ధారించిందని.. అక్రమ మైనింగ్‌కు పాల్పడిన వారి పేర్లు, వివరాలు తెలపాలని ఎన్జీటీ ఆదేశించినట్లు లేఖలో వివరించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సహా ఇతర అధికారులు స్వయంగా పరిశీలించి మైనింగుపై శాస్త్రీయ నివేదిక ఇవ్వాలన్న ఎన్జీటీ ఆదేశాలను అమలు చేయాలని కోరారు.

Deputy CM Narayana Swamy: వైసీపీలో రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు

Exit mobile version