Site icon NTV Telugu

ఈ నెల 29న కుప్పంకు చంద్రబాబు

chandrababu naidu

టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల 29న కుప్పంలో పర్యటించనున్నారు. గత పది రోజులుగా ఏపీలో జరుగుతున్న పరిణామాల దృష్యా కుప్పంలో చంద్రబాబు పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కుప్పంలో రెండు రోజులు పర్యటించనున్న చంద్రబాబు.. 29 కుప్పంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. మరుసటి రోజు 30న కుప్పం పరిధిలోని గ్రామాల్లో పర్యటిస్తారు.

అయితే గత పంచాయతీ ఎన్నికల్లో కుప్పంలో టీడీపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కుప్పంలో టీడీపీ ఉనికి కొల్పొకుండా ఉండేందుకు గ్రామస్థాయి నుంచి కేడర్‌ను కాపాడుకునేందుకు చంద్రబాబు ఈ పర్యటన చేస్తున్నారని టీడీపీ శ్రేణులు అంటున్నారు. టీడీపీ కార్యకర్తల్లో నూతన ఉత్తేజం నింపడమే లక్ష్యంగా చంద్రబాబు ముందుకు వెళ్లనున్నారని తెలుస్తోంది.

Exit mobile version