Telugu Desam Party: చిత్తూరు జిల్లాపై బాబు సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, గ్రూప్ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే చంద్రబాబు సమీక్షలు ప్రారంభించారు. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్‌తో చర్చించారు.
CM Jagan: వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్
Also Read
- CM Chandrababu: రాయలసీమ గ్లోబల్ హార్టికల్చర్ హబ్.. రైతుల ఆదాయంపై చంద్రబాబు ఫోకస్
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- Nara Lokesh: సీమ రైతుల సత్తా ప్రపంచానికి తెలియాలి.. లోకేష్ పిలుపు
చిత్తూరు, తిరుపతి పార్లమెంటుల పరిధిలోని నేతల పని తీరుపై చంద్రబాబుకు బీదా రవిచంద్ర నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా నెలలో 15 రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించాలని బీదాకు చంద్రబాబు సూచించారు. క్షేత్ర స్థాయి పర్యటన తర్వాత నేతల పని తీరుపై డిటైల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీకి చికాకు కలిగించే నేతల జాబితా సిద్ధం చేయాలని రవిచంద్రకు స్పష్టం చేశారు. నెల రోజుల్లోగా నేతల మధ్య విబేధాలు, గ్రూపు రాజకీయాలు లేకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. నెల రోజుల తర్వాత కూడా మార్పు రాని నేతల విషయంలో కఠిన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. త్వరలో మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల సమన్యకర్తలతో ఆయన వరుస భేటీలు నిర్వహించనున్నారు. కాగా వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా ఇప్పటి నుంచే చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
తాజావార్తలు
-
Secunderabad Army Weapons : ఆర్మీ ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. వెబ్ సిరీస్‌లు చూసి స్కెచ్
-
World Cup 2027: 2027 ప్రపంచ కప్‌లో ‘గ్రూప్ ఆఫ్ డెత్’గా గ్రూప్ బీ.. పాపం ఆ టీమ్ పరిస్థితి ఘోరం..
-
Joe Biden-Netanyahu: గాజా యుద్ధంపై నెతన్యాహు-బైడెన్ మధ్య వాగ్యుద్ధం జరిగిందా? వెలుగులోకి ఆసక్తికర విషయాలు
-
Mission Shakti: భారత్ ‘‘శాటిలైట్’’ను పేల్చేయడంతో అమెరికా షాక్.. యూఎస్ ఇంటెలిజెన్స్‌లో కలకలం!
-
రూ.2,254 నుంచి రూ.984! ఒక్క దెబ్బతో 5 ఏళ్ల లాభాలు స్వాహా.. PB ఫిన్‌టెక్‌ను ముంచేసిందెవరు?
ట్రెండింగ్
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!