NTV Telugu Site icon

Telugu Desam Party: చిత్తూరు జిల్లాపై బాబు సమీక్ష.. కీలక ఆదేశాలు జారీ

Chandrababu 1

Chandrababu 1

మహానాడు తర్వాత పార్టీ పటిష్టత, గ్రూప్ రాజకీయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వకర్తలతో వరుస సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. సొంత జిల్లా చిత్తూరు నుంచే చంద్రబాబు సమీక్షలు ప్రారంభించారు. ఈ మేరకు చిత్తూరు, తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్త బీద రవిచంద్ర యాదవ్‌తో చర్చించారు.

CM Jagan: వైసీపీ నుంచి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెన్షన్

చిత్తూరు, తిరుపతి పార్లమెంటుల పరిధిలోని నేతల పని తీరుపై చంద్రబాబుకు బీదా రవిచంద్ర నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా నెలలో 15 రోజుల పాటు నియోజకవర్గాల్లో పర్యటించాలని బీదాకు చంద్రబాబు సూచించారు. క్షేత్ర స్థాయి పర్యటన తర్వాత నేతల పని తీరుపై డిటైల్డ్ రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. పార్టీకి చికాకు కలిగించే నేతల జాబితా సిద్ధం చేయాలని రవిచంద్రకు స్పష్టం చేశారు. నెల రోజుల్లోగా నేతల మధ్య విబేధాలు, గ్రూపు రాజకీయాలు లేకుండా చూడాలని చంద్రబాబు సూచించారు. నెల రోజుల తర్వాత కూడా మార్పు రాని నేతల విషయంలో కఠిన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు హెచ్చరించారు. త్వరలో మిగిలిన పార్లమెంట్ నియోజకవర్గాల సమన్యకర్తలతో ఆయన వరుస భేటీలు నిర్వహించనున్నారు. కాగా వచ్చే ఎన్నికలకు అభ్యర్థుల ఖరారు ప్రక్రియలో భాగంగా ఇప్పటి నుంచే చంద్రబాబు కసరత్తు ప్రారంభించారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.