కరోనా విపత్కర కాలంలో రోజుకు 150 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసి దేశానికే ఊపిరి పోసింది విశాఖ ఉక్కు కర్మాగారం అని చంద్రబాబు తెలిపారు. వెయ్యి పడకలతో కొవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు కూడా ముందుకు వచ్చి ఎన్నో ప్రాణాలు కాపాడుతోంది.అటువంటి విశాఖ ఉక్కును కబళించాలని కొందరు వైసీపీ పెద్దలు కుట్రలు చేస్తున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 100 రోజులుగా దీక్షలు జరుగుతున్నాయి. దీనిపై పార్లమెంటులో ఒక్క మాటకూడా మాట్లాడని వైసీపీ, అసెంబ్లీలో తీర్మానం చేయడం ప్రజలను మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటై, వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తూ.. దేశ ఆర్థికాభివృద్ధికి దోహద పడుతున్న విశాఖ ఉక్కు పరిరక్షణకు తెలుగుదేశం ఎప్పటికీ కట్టుబడి ఉంటుంది. ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంది అని పేర్కొన్నారు.