Site icon NTV Telugu

Chandrababu Naidu: ప్రతి ఒక్కరూ పార్టీకి అంకితమై పనిచేయాలి

తెలుగుదేశం పార్టీ 40 వసంతాలు పూర్తిచేసుకుని ఇవాళ 41వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం కార్యకర్తలు, నేతలు, అభిమానులందరికీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ చేతుల మీదుగా తెలుగుదేశం ఆవిర్భావం.. ఒక రాజకీయ అనివార్యం.కొందరు వ్యక్తుల కోసమో.. కొందరి పదవుల కోసమో ఏర్పడిన పార్టీ కాదు తెలుగుదేశం.ప్రజల కోసం.. ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టిన పార్టీ తెలుగుదేశం. పేదలకు కూడు, గూడు, గుడ్డ నినాదంతో నాడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ తెలుగుదేశం. ఈ 40 ఏళ్లలో సామాన్య ప్రజల జీవితాల్లో పెను మార్పులు తెచ్చింది. కొందరికే పరిమితమైన అధికారాన్ని అన్ని వర్గాలకు పంచింది.

తెలుగుదేశం అంటేనే అభివృద్ధి.. సంక్షేమం. సంస్కరణల ఫలితాలను గ్రామ స్థాయికి అందించిన చరిత్ర టీడీపీదే అన్నారు చంద్రబాబునాయుడు. పాలనపై పాలకులను ప్రశ్నించే తత్వాన్ని ప్రజలకు నేర్పింది టీడీపీనే. పార్టీ చారిత్రక ప్రాధాన్యాన్ని గుర్తుకు తెచ్చేలా తెలుగుదేశం 40 వసంతాల వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు. ప్రతి ఒక్కరూ పార్టీ కోసం పునరంకితం అయ్యేలా ఈ వేడుకలు ఉండాలి. రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అవసరమేంటో ప్రజలకు వివరించేలా కార్యక్రమాలు సాగాలి.

పార్టీ ఆవిర్భావం సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. 40 వసంతాల పసుపు పండుగ జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. దేవుడు ఎన్టీఆర్, రాముడు చంద్రబాబు.. వీరే ధైర్యం. కార్యకర్తలే బలం, పసుపు జెండానే పవర్. దేశానికి సంక్షేమాన్ని పరిచయం చేసింది మా తాత, అభివృద్ధిని పరిచయం చేసింది మా నాన్న. అధికారం ఉన్నా లేకున్నా ప్రతి క్షణం ప్రజల గురించి ఆలోచించేది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేద్దాం అంటూ ట్వీట్ చేశారు లోకేష్.

https://ntvtelugu.com/medicine-prices-hike-on-april-1st-2022/
Exit mobile version