NTV Telugu Site icon

Chandrababu Naidu: గిరిజన హక్కుల పరిరక్షణకు చర్యలేవీ?

Nara Chandrababu Naidu New Facebook

Nara Chandrababu Naidu New Facebook

గిరిజనుల సాంప్రదాయక భూములు గిరిజన తెగలకే దక్కాలన్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. గిరిజనులకు ఆదివాసీ దివస్ సందర్భంగా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. గిరిజనుల సంక్షేమం దిశగా ప్రభుత్వం కృషి చేయకపోగా, గిరిజన భూముల ఆక్రమణను జోరుగా సాగిస్తోంది. బాక్సైట్ తవ్వకాల ఒప్పందాలను 2016లో మా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పుడు లేటరైట్ ముసుగులో బాక్సైట్ దోపిడీ జరుగుతోంది. బాక్సైట్ దోపిడీ కోసం అడవులను నరికేసి ఆగమేఘాలమీద రోడ్డు వేసేసారు. అంతవేగంతో రాష్ట్రంలో ఇంకెక్కడైనా కిలోమీటరు రోడ్డు వేసారా? గిరిజన గ్రామాల్లో ఎవరైనా అనారోగ్యం పాలైతే వారిని డోలె కట్టి కిలోమీటర్ల కొద్దీ మోసుకెళ్లాల్సిన దుస్థితి ఉంది.

ఇప్పటికీ తాగేందుకు గిరిజనులు గెడ్డ నీటినే ఉపయోగిస్తున్నారు. గెడ్డలో నీరు కలుషితమై గిరిజనులు జబ్బుల బారిన పడుతున్నా ప్రభుత్వం తాగునీటి సరఫరాకు ఎలాంటి ప్రయత్నమూ చేయడం లేదు. ఇప్పటికైనా గిరిజన సంక్షేమం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. గిరిజన సోదరులకు ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ఆది నుంచీ గిరిజన సంక్షేమం, గిరిజన హక్కుల పరిరక్షణ కోసం కృషి చేసింది. గిరిజన ప్రాంత భూములు, ఉద్యోగాలు, అటవీ హక్కులు వంటి వాటి కోసం ఆనాడు ఎన్టీఆర్ 14 చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుని జీవోలు కూడా తెచ్చారు.

షెడ్యూల్డ్‌ ప్రాంతంలో జీవో 3 ప్రకారం అన్ని ప్రభుత్వ శాఖలలోని ఉద్యోగాలన్నింటినీ స్థానిక గిరిజన అభ్యర్థులతో భర్తీ చేయాలి. ఆ జీవోను ప్రస్తుత వైసీపీ హయాంలోనే కోర్టు రద్దు చేస్తే… పునరుద్ధరణ కోసం ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నమూ చేయకపోవడం విచారకరం. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిన బైక్ అంబులెన్సులు ఇప్పుడు లేవు. అలాగే గిరిజన ప్రాంతాల్లో వారాంతపు సంతల్లో రోగులకు మెరుగైన వైద్యం కల్పించేందుకు ఏర్పాటు చేసిన మొబైల్‌ అంబులెన్స్‌ సేవలు కూడా ఇప్పుడు లేవన్నారు చంద్రబాబునాయుడు.

Telangana Congress: మునుగోడు ఉపఎన్నికలో గెలుపు ఆ పార్టీకి సవాల్ గా మారిందా.?