Site icon NTV Telugu

Chandrababu Naidu: చంద్రబాబు మే డే శుభాకాంక్షలు

Chandrababu

Chandrababu

కార్మికులకు, కర్షకులకు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మే డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. శ్రామిక, కార్మిక సోదరులందరికీ అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు. పరిశ్రమలే రాష్ట్ర ప్రగతికి మెట్లు. టీడీపీ హయాంలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన తో లక్షల మంది ఉపాధి పొందారు.

నాటి టీడీపీ పాలనలో పారిశ్రామిక రంగం కళకళలాడుతూ కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. అలాంటి రాష్ట్రంలో ఇప్పుడు కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న పరిశ్రమలు పవర్ హాలిడేలతో అల్లాడిపోతుంటే.. కార్మిక లోకం తల్లడిల్లి పోతుంది. కనీసం కార్మికులకు ప్రమాద బీమా కూడా ఇవ్వలేని పరిస్థితి నేడు. కార్మిక లోకమంతా ఒక్కతాటిపైకి వచ్చి ప్రభుత్వ తిరోగమన విధానాలపై మేడే స్పూర్తితో పోరాడాలి. కార్మిక, శ్రామిక లోకానికి మేలు చేసే ఏ పోరాటానికైనా తెలుగుదేశం పూర్తి మద్దతునిస్తుందని ట్వీట్ చేశారు చంద్రబాబు.

Exit mobile version