Site icon NTV Telugu

Chandrababu Naidu: ప్రధాని నరేంద్ర మోడీకి చంద్రబాబు లేఖ

Chandrababu Narendra Modi

Chandrababu Narendra Modi

NTR శతజయంతి సందర్భంగా NTR పేరుతో ప్రత్యేక నాణెం విడుదల చేసే అంశం పై ధన్యవాదాలు తెలుపుతూ లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. లేఖలో అనేక అంశాలు ప్రస్తావించారు. NTR శతజయంతి సందర్భంగా ప్రత్యేక నాణెం విడుదల చేయడం పై టీడీపీ పొలిట్ బ్యూరో మీకు ధన్యవాదాలు తెలిపింది.నాణెం విడుదల విషయంలో చొరవ తీసుకున్న కేంద్రానికి, మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్నారు చంద్రబాబు. నేడు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్‌లో నిర్వహించిన పోలిట్ బ్యూరో సమావేశం మీ నిర్ణయాన్ని స్వాగతించింది.

Read Also:Atrocious: వీడు మనిషా రాక్షసుడా.. 15నెలల బిడ్డను గోడకేసి కొట్టి చంపాడు

నాణేన్ని విడుదల చేయడానికి 2023 మార్చి 20న గెజిట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసినందుకు మీ నాయకత్వంలోని భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ పొలిట్‌బ్యూరో తీర్మానం చేసింది.ఎన్టీఆర్ తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఎన్టీఆర్‌ని సన్మానించడమంటే తెలుగు వారిని గౌరవించడమే అని తన లేఖలో పేర్కొన్నారు చంద్రబాబునాయుడు, ఎన్టీఆర్ 100వ జయంతిని పురస్కరించుకుని నాణెం విడుదల చేస్తున్నందుకు తెలుగు ప్రజల తరపున, తెలుగుదేశం పార్టీ తరపున, వ్యక్తిగతంగా నా తరుపున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని లేఖలో వివరించారు చంద్రబాబు.

Read Also: Parineeti Chopra: ఆప్ నేతతో పరిణీతి సీక్రెట్ గా అది కానిచ్చేసిందా.. ఆ ట్వీట్ కు అర్ధం ఏంటి..?

Exit mobile version