Site icon NTV Telugu

Chandrababu : పశువులు కూడా వీళ్లతో పోల్చితే ఒప్పుకోవు

టీడీపీ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల సర్పంచులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు టీడీపీ అధినేత చంద్రబాబు, అయ్యన్నపాత్రుడు, గుమ్మడి సంధ్యారాణి లు హజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు సర్పంచులకు దిశానిర్దేశం చేశారు. టీడీపీ హయాంలో సర్పంచులకు స్వర్ణయుగంగా ఉండేదని, సర్పంచులకు చెక్ పవర్ ఇచ్చింది టీడీపీనేనని ఆయన అన్నారు. ఇప్పుడు గ్రామంలో మరుగుదొడ్లకు జగన్ రంగులు వేసుకుంటున్నారని, 14, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ. 7600 కోట్లు దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. గ్రామ సభ ఆమోదం లేకుండా నేరుగా నిధులు ఖర్చు పెట్టకూడదని, నరేగా పనుల్లో రూ. 260 కోట్లు అవినీతి అని కేంద్రం తేల్చిందన్నారు. ఎప్పటికైనా ధర్మం, న్యాయం గెలుస్తుందని అమరావతి ఉద్యమాన్ని చూస్తే అర్ధం అవుతుందని ఆయన అన్నారు.

రాజధాని విషయంలో ఎందుకు మడమ తిప్పారో.. ఎందుకు మాట తప్పడో జగన్ చెప్పాలన్నారు. జగన్ తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నారు.. రాజధాని ఇక్కడే అన్నారు. 3 క్యాపిటల్ అని ఇప్పుడు మూడు ముక్కల ఆట మొదలు పెట్టారు సీఎం జగన్. పశువులు కూడా వీళ్లతో పోల్చితే ఒప్పుకోవు. రాజధానిలో ఒకే వర్గం అని తప్పుడు ప్రచారం చేశారు అని ఆయన మండిపడ్డారు. ముంపు లేని చోట ముంపు అని ప్రచారం చేశారని, కృష్ణానది పక్కన ఉండే భూమిని స్మశానం అన్నారని, ఇలాంటి దుర్మార్గులు ఉంటారని పక్కాగా సీఆర్డీఏ చట్టం చేసామన్నారు. 807 రోజులు రైతులు ఆందోళన చేస్తే అవమానించారని, మహిళా రైతులు వీరోచితంగా పోరాడారన్నారు. పాదయాత్రకు వెళ్ళిన రైతులను ఎంత ఇబ్బందులు పెట్టారో అంతా చూశామని, తప్పుడు నిర్ణయాలతో జగన్ చరిత్ర హీనునుడిగా మిగిలిపోతారని విమర్శించారు. ఈ రోజు కోర్టు ద్వారా వచ్చిన విజయం 5 కోట్ల తెలుగు ప్రజలదని, రాజధాని ఉద్యమ రైతులకు, ప్రజలకు అభినందనలు తెలిపారు. సిగ్గు లేకుండా నాకు కులం అంట గడుతున్నారని, నాకు ఏ కులం లేదు.. పేదలే నా కులమని ఆయన అన్నారు.

Exit mobile version