Site icon NTV Telugu

సీఎం జగన్‌కు చంద్రబాబు లేఖ..

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు టీటీడీ అధినేత చంద్రబాబు నాఉడు.. కడప నుంచి విమాన సర్వీసులు పునరద్దరించాలని లేఖలో సీఎంను కోరారు.. అభివృద్ధి చెందాలన్నా, పరిశ్రమలు రావాలన్నా రవాణా సౌకర్యమనేది ప్రధానం.. అందరికీ విమాన సదుపాయం అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఉడాన్‌ పథకాన్ని సద్వినియోగం చేసుకుంటూ అప్పటి టీడీపీ ప్రభుత్వం టైర్-2, టైర్‌ -3 నగరాల మధ్య విమాన సర్వీసులను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేసిన ఆయన.. హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు, విజయవాడ, తిరుపతి నుంచి కడపకు నేరుగా విమాన సర్వీసులు ఏర్పాటు చేశామని.. అయితే, కడప నుంచి విమాన సర్వీసులు ప్రస్తుతం నిలిపేయడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

కడప ఇతర ప్రాంతాల సామాన్య ప్రయాణికులు.. పారిశ్రామిక వేత్తల ఇబ్బందులని దృష్టిలో పెట్టుకుని సర్వీసులు పునరద్దరించాలని లేఖలో సీఎంను కోరిన చంద్రబాబు.. పెట్టుబడిదారులే కాకుండా సామన్య ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారని.. కడప నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టంగా మారిందని.. ఈ నేపథ్యంలో.. కడప, ఇతర ముఖ్య పట్టణాల మధ్య విమాన సర్వీసులను పునరుద్ధరించాలని.. కడప, ఇతర ప్రాంతాల ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Exit mobile version