ఏపీలో సంభవించిన వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని పార్లమెంట్ లో డిమాండ్ చేయాలని నిర్ణయించింది టీడీపీపీ… పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది.. వర్చువల్ గా జరిగిన ఈ సమావేశం ద్వారా పార్టీ ఎంపీలకు పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు చంద్రబాబు…
Read Also: ఏపీ మూడు రాజధానుల కేసు.. హైకోర్టు నిర్ణయంపై ఉత్కంఠ
వరద సాయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం, జ్యుడీషియల్ విచారణకి డిమాండ్ చేయాలని టీడీపీ భావిస్తోంది.. ప్రత్యేక హోదా విషయమై పార్లమెంట్ ఉభయ సభల్లో ఒత్తిడి తేవాలని ఎంపీలకు సూచించారు చంద్రబాబు.. ఏపీ నుంచి ఇతర రాష్ట్రాలకు గంజాయి, హెరాయిన్ సరఫరా అంశాన్ని పార్లమెంటులో లేవనెత్తాలని ఆదేశించిన టీడీపీ అధినేత… వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని సూచించారు.. ఇక, పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం ఇచ్చిన నిధులు మళ్లింపు అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని ఎంపీలకు స్పష్టం చేశారు చంద్రబాబు.
