Site icon NTV Telugu

Chandrababu : జగన్ రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్

అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ స్ట్రాటజీ కమిటీ భేటీ అయింది. ఈ నెల 21న పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించనున్నామని చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలో జగన్ మోసపు రెడ్డి పాలన వల్లే అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో అంధకారం ఏర్పడిందన్నారు. జగన్ ఒక అపరిచితుడు.. తన రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్ అవుతోంది. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్ట్ కు శాపంగా మారాయి.

నెల్లూరు కోర్టులో దొంగల వ్యవహారంలో ముమ్మాటికీ మంత్రి కాకాని హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. జగన్ ఏదో చేస్తారని భావించిన సొంత వర్గం కూడా ఇప్పుడు తీవ్ర అసంతృప్తితో, ఆవేదనతో ఉంది. ఒక అపరిచితునిలా వ్యవహరిస్తున్న జగన్ తీరుతో రాష్ట్ర విభజన కంటే ఎక్కువ నష్టం. జగన్ ఎంత బలహీనుడో అతని క్యాబినెట్ విస్తరణ చూస్తేనే అర్థం అవుతుంది.

Read Also:
Ramakrishna: కాకాని ఫైల్ మాత్రమే ఎలా ఎత్తుకెళ్తారు..?
వైసీపీలో డొల్లతనం, అసంతృప్తి క్యాబినెట్ విస్తరణ సందర్భంగా బయటపడింది. బ్లాక్ మెయిల్ చేసిన వారికి భయపడి జగన్ పదవులు ఇచ్చినట్లు సొంత పార్టీలోనే ప్రచారం జరుగుతోందన్నారు. ఉత్తరాంధ్రలో మూడేళ్లు దోచుకున్న సాయిరెడ్డి ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమే. ఒకటో తేదీనే ఇంటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడానికే వాలంటీర్లను పెట్టాను అని చెప్పిన జగన్.. ఇప్పుడు మొదటి వారంలో కూడా పెన్షన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? చెప్పాలన్నారు.

Exit mobile version