ప్రముఖ కన్నడ నటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పునీత్ మరణం నన్ను షాక్ కి గురి చేసింది.కన్నడ సినీ పరిశ్రమలో తన విలక్షణమైన నటనతో లక్షలాది మంది అభిమానులను పునీత్ సంపాదించుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న పునీత్ రాజ్ కుమార్ చిన్నవయసులోనే గుండెపోటుకు గురై మృతి చెందడం బాధాకరం.
పునీత్ మృతిని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబసభ్యులకు భగవంతుడు ఇవ్వాలి. పునీత్ రాజ్ కుమార్ ఆత్మకు శాంతిచేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానన్నారు చంద్రబాబు. ఈమేరకు ట్వీట్ చేశారు బాబు.కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ బెంగళూరు విక్రమ్ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. ఉదయం జిమ్‌లో గుండెపోటుకు గురైన పునీత్ అనంతరం కన్నుమూశారు. పునీత్ మృతితో ఆయన అభిమానులు, యావత్ సినీపరిశ్రమ శోక సంద్రంలో మునిగిపోయింది.
