NTV Telugu Site icon

Chandra Babu: 30 ఏళ్లు అధికారంలో ఉండేలా టీడీపీ నేతలు పనిచేయాలి

Chandrababu

Chandrababu

విశాఖ పర్యటనలో టీడీపీ కార్యకర్తలతో నిర్వహించిన క్రియాశీలక సమావేశంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ఇంటింటికీ తీసుకెళ్లే బాధ్యత టీడీపీ కార్యకర్తల భుజస్కంధాలపై ఉందన్నారు. పార్టీలో పని చేసే వాళ్ళకే పదవులు, ప్రజలతో ఉన్న వాళ్ళకే నాయకత్వ అవకాశం దక్కుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. వచ్చే 30 ఏళ్లు అధికారంలో ఉండేలా ఎన్నికల్లో పనిచేయాలని సూచించారు. పార్టీలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని తెలిపారు. పెద్ద ఎత్తున ప్రజలు పార్టీలో చేరేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీకి ఆర్ధికంగా సహాయం చేసిన వాళ్లకు భవిష్యత్‌లో మంచి అవకాశాలు ఉంటాయని చంద్రబాబు అన్నారు.

టీడీపీలో ప్రతి కార్యకర్త పనితీరును డిజిటలైజ్ చేస్తామని.. ఇతర సేవలను కూడా డిజిటలైజ్ చేసి భవిష్యత్‌లో కార్యకర్తలకు అవకాశాలు కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. జగన్ ప్రభుత్వం పెట్టే కేసులకు ఎవరూ భయపడవద్దని సూచించారు. ఎన్ని కేసులు ఉంటే అంత భవిష్యత్ ఉంటుందనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఒక ట్రిబ్యునల్ ఏర్పాటు చేసి కేసులన్నీ పరిష్కరించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. మరోవైపు జగన్ రెడ్డి గ్రామానికి ఒక సైకోను తయారు చేశాడని.. ఈ రాజకీయ సైకోలను అణిచివేసే శక్తి, బాధ్యత మనకు ఉందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్‌రెడ్డిది ఐరన్ లెగ్ అని.. ఆయన అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం దివాళా తీసిందని చంద్రబాబు ఆరోపించారు. కోడికత్తి డ్రామాలు లాంటివి మనం చేయలేదని.. చేయాల్సిన అవసరం కూడా లేదని పేర్కొన్నారు.

CM Jagan: టెన్త్ పేపర్లు లీక్ చేసింది శ్రీచైతన్య, నారాయణ కాలేజీ వాళ్లే

Show comments