Site icon NTV Telugu

Chandrababu : విధ్వంస పాలనలో పర్యావరణానికి అపార నష్టం

Chandrababu

Chandrababu

నేడు పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని టీడీపీ అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విధ్వంస పాలనలో రాష్ట్రంలో పర్యావరణానికి అపార నష్టం జరుగుతోందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా కొండలను కొట్టేస్తూ.. ఇసుకను దోచేస్తూ.. జల వనరులను మింగేస్తూ, గనులను కబళిస్తూ పర్యావరణ వినాశనానికి పాల్పడుతున్నారని ఆయన మండిపడ్డారు.

పర్యావరణానికి హాని కలిగిస్తోన్న ఈ ప్రభుత్వ పెద్దలపై ప్రజలు రణం చేయాల్సిందేనని ఆయన ఉద్ఘాటించారు. సహజ వనరుల దోపిడితో ప్రకృతికి ఈ పాలకులు చేసే హాని అంతా ఇంతా కాదని ఆయన వ్యాఖ్యానించారు. పర్యావరణ వేత్తలతో, ప్రకృతి ప్రేమికులతో కలిసి పర్యావరణ విధ్వంసానికి అడ్డుపడదామని చంద్రబాబు పిలుపునిచ్చారు. నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని గుర్తుచేసుకుంటూ రాష్ట్రాన్ని కాపాడుకుందామని ఆయన అన్నారు.

Exit mobile version