ఏపీలో ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్రంలో బీజేపీ ఓట్లు అడిగే హక్కు లేదు అని చలసాని శ్రీనివాస్ అన్నారు. పార్లమెంట్ లో కేంద్ర మంత్రి హోదా ముగిసిన చాప్టర్ అని ఎలా అంటారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రాన్ని వైసీపీ ప్రభుత్వం ఎందుకు నిలదీయలేదు అని ప్రశ్నించారు. విభజన హామీల గురించి ఎందుకు మెతక వైఖరి అవలంభిస్తోంది. బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఇస్తున్న నిధులు ఎంత.. ఏపీకి ఎంత ఇస్తున్నారు అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏపీలో అధికారం ఇవ్వమని ఎలా అడుగుతారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వలన కేంద్రం ముష్టి కూడా వేయలేదు అని పేర్కొన్నారు. ఇక రాయలసీమ, ఉత్తరాంధ్రకు జరుగుతున్న అన్యాయం గురించి ఎందుకు నోరు మెదపరు అని అన్నారు.
బీజేపీకి ఏపీలో ఓట్లు అడిగే హక్కు లేదు..
