Chain Snatchers: పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవడమే కాకుండా ప్రత్యేక నిఘా పెడుతున్నప్పటికీ.. చైన్ స్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఒంటరిగా వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేసుకొని, హఠాత్తుగా ఎగబడుతున్నారు. బంగారు గొలుసుల్ని లాక్కెళుతున్నారు. తాజాగా నంద్యాల జిల్లాలోని డోన్‌లోనూ ఇలాంటి సంఘటన వెలుగు చూసింది. డోన్, ప్యామిలీలో మూడు ప్రాంతాల్లో చైన్ స్నాచర్లు పంజా విసిరారు. పాతపేటలో అనసూయ అనే మహిళ మెడలో 4 తులాల బంగారు చైన్‌ని దుండగులు లాక్కెళ్లిపోయారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఇంటి ముందు ఆమె ముగ్గు వేస్తుండగా.. దుండగులు బైక్‌పై వచ్చి, చైన్ లాక్కెళ్లారు. ఒక్కసారిగా దుండగులు ఎటాక్ చేయడంతో ఆమె భయాందోళనలకు గురైంది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Jacques Kallis: 48 ఏళ్ల వయసులో ఆ కొట్టుడేంది సామీ.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!
అలాగే.. టీఆర్ నగర్‌లోనూ మహాలక్ష్మి అనే మహిళ మెడలో బంగారు చైన్‌లు దుండగులు తీసుకెళ్లారు. కిరాణా షాప్‌లో ఉండగా.. ఉన్నట్లుండి చైన్ స్నాచర్స్ దాడి చేసి, గొలుసు లాక్కొని వెళ్లారు. ఇక మూడో ఘటన ప్యాపిలీలో చోటు చేసుకుంది. దుండగులు మెడలో ఉన్న గొలుసు లాక్కునేందుకు ప్రయత్నించగా.. మహిళ ప్రతిఘటించింది. అంతేకాదు.. కాపాడాల్సిందిగా గట్టిగా కేకలు వేసింది. దీంతో.. దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలపై బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి అధికారులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దుండగుల్ని గుర్తు పట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని, నిందితుల్ని పట్టుకుని శిక్షిస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.
Man cuts off Finger: ప్రధాని మోడీకి ఓటు వేసిన వేలును నరుకున్న వ్యక్తి.. కారణమేంటంటే?