NTV Telugu Site icon

ఏపీకి కేంద్ర బృందాలు.. రేపటి నుంచి వరద నష్టం అంచనా

ఆంధ్రప్రదేశ్‌ను భారీ వర్షాలు, వరదలు దెబ్బకొట్టాయి.. నెల్లూరుతో పాటు రాయలసీమ జిల్లాలు అతలాకుతలం అయ్యాయి.. ఇప్పటికే వరద నష్టంపై ప్రాథమికంగా అంచనా వేశారు అధికారులు.. అయితే, వరద నష్టాన్ని అంచనా వేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు రానున్నాయి కేంద్ర బృందాలు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితులను ప్రత్యక్షంగా గమనించి ఓ అంచనాకు రానున్నారు..

రేపు రాష్ట్రానికి రానున్న ఏడుగురు సభ్యులతో కూడిన కేంద్ర ప్రభుత్వం.. సంబంధిత జిల్లాల్లో పర్యటించనుంది.. ఈ నెల 26న చిత్తూరు, 27న చిత్తూరు, కడప జిల్లాలు, 28వ తేదీన నెల్లూరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటనలు సాగనున్నాయి.. ఈ నెల 29వ తేదీన ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీ కానుంది.. సీఎం లేఖ మేరకు కేంద్ర బృందాన్ని ఏపీకి పంపుతోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. కేంద్రం నుంచి వచ్చే ఏడుగురు సభ్యులు రెండు బృందాలుగా ఏపీలో పర్యటించనున్నారు.. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కేంద్ర బృందం పర్యటనలు కొనసాగనున్నాయి.. కేంద్ర హోం శాఖ సలహాదారు కునాల్ సత్యార్ధి నేతృత్వంలో ఏపీలో పర్యటించనున్నాయి కేంద్ర బృందాలు.