Site icon NTV Telugu

AP New Districts: ఏపీలో కొత్త జిల్లాల‌కు LGD కోడ్‌లు జారీ చేసిన కేంద్రం

New Districts

New Districts

ఏపీలో ఇటీవ‌ల ప్రభుత్వం 13 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలతో కలిపి ఏపీలో జిల్లాల సంఖ్య 26కి చేరింది. అయితే ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన 13 జిల్లాలకు కేంద్ర ప్రభుత్వం లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ (ఎల్‌జీడీ) కోడ్‌లను కేటాయించింది. పార్వతీపురం మన్యం జిల్లాకు 743, అనకాపల్లికి 744, అల్లూరి సీతారామరాజు జిల్లాకు 745, కాకినాడకు 746, కోనసీమకు 747, ఏలూరుకు 748, ఎన్టీఆర్ జిల్లాకు 749, బాపట్లకు 750, పల్నాడుకు 751, తిరుపతికి 752, అన్నమయ్య జిల్లాకు 753, శ్రీ సత్యసాయి జిల్లాకు 754, నంద్యాలకు 755 కోడ్‌లను కేటాయించింది.

ఇకపై ఈ కోడ్‌ల ఆధారంగానే పాలనాపరమైన వ్యవహారాలు నడుస్తాయి. జనగణన నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నీ దీని ద్వారానే జరగనున్నాయి. ముఖ్యంగా వివిధ రాష్ట్రాలతో పాలనాపరమైన సంప్రదింపులు, వివిధ పథకాలను సంబంధించి జిల్లాల వారీగా కేటాయింపులు వంటి అంశాలలో ఈ కోడ్‌లను వినియోగిస్తారు. పంచాయత్‌ ఈ-పంచాయత్‌ మిషన్‌ మోడ్‌ కింద ఎంటర్‌ప్రైజ్‌ సూట్‌ (పీఈఎస్‌) పేరుతో రూపొందించే అప్లికేషన్లలో వీటిని వినియోగిస్తారు.

https://ntvtelugu.com/ycp-mp-vijayasaireddy-demands-central-government-institutions-for-new-districts/

Exit mobile version