Site icon NTV Telugu

IPS Officers: ఏపీ, తెలంగాణకు కొత్త ఐపీఎస్‌ల కేటాయింపు

Ips Officers

Ips Officers

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కొత్త ఐపీఎస్‌ అధికారులను కేటాయించింది. 2020 సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ఐపీఎస్‌కు ఎంపికైన మొత్తం 200 మందిలో తెలంగాణకు ఐదుగురు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదుగురు చొప్పున కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2021 నవంబర్‌ నాటికి ఉన్న ఖాళీల ఆధారంగా ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కేటాయింపులు చేసింది. తెలంగాణకు కేటాయించిన ఐపీఎస్ అధికారుల్లో ఇద్దరు తెలంగాణ వారే ఉండటం విశేషం.

తెలంగాణకు కేటాయించిన వారిలో అవినాష్ కుమార్(బీహార్), కాజల్‌(ఉత్తరప్రదేశ్), రాహుల్‌రెడ్డి(తెలంగాణ‌), శివం ఉపాధ్యాయ(అసోం), సరుకొంటి శేషాద్రిణిరెడ్డి(తెలంగాణ‌) ఉన్నారు. ఏపీకి కేటాయించిన వారిలో ఆడెపు వర్షిత(ఒడిశా), బి.ఆదిత్య(రాజ‌స్థాన్‌), అభిషేక్‌ అందాసు(రాజ‌స్థాన్‌), కోటా కిరణ్‌కుమార్‌(బీహార్), చిలుముల రజనీకాంత్‌(మ‌హారాష్ట్ర) ఉన్నారు.

Exit mobile version