తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. కరోనా నిబంధనలు ఉల్లంఘించి హోటల్‌లో మీటింగ్ పెట్టారని ధూళిపాళ్లపై కేసులు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్దంగా 20మందితో మీటింగ్ పెట్టినట్లు ఆరోపణలు రావడంతో ధూళిపాళ్లపై చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్దమౌతున్నారు. ఇప్పటికే సంగం డైరీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ధూళిపాళ్లను గతంలో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో ధూళిపాళ్ల బయటకు వచ్చారు. బెయిల్‌పై వచ్చిన తరువాత, నిబంధనలకు విరుద్దంగా హోటల్‌లో 20మందితో మీటింగ్ పెట్టారని ఆరోపణలు రావడంతో ఆయనపై పోలీసులు కేసులు నమోదుచేశారు.
ధూళిపాళ్లపై మరో కేసు నమోదు… నిబంధనలు ఉల్లంఘించారని…
