Site icon NTV Telugu

గంజాయి సాగుతో బలవుతున్న గిరిజనులు

కొన్నేళ్లుగా ఏవోబీ బార్డర్‌లో గంజాయి సాగు విస్తృతంగా సాగుతుంది. దీంతో ప్రభుత్వం దీనిపై ఉక్కుపాదం మోపుతుంది. విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట సాగు చేస్తున్న గిరిజనులు మీడియాతో మాట్లాడారు. మేం ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం లేదు. గంజాయి మొక్కలు సాగు నేరమే అయినా ఎన్నో కష్టాలతో మేం ముందుకు వచ్చాం. ప్రభుత్వం ముందే చెబితే మేం గంజాయి వేసే వాళ్లం కాదు కదా అంటున్న గిరిజ నులు. మా ఆర్థిక స్థితిగతుల ప్రకారమే మేం గంజాయి వేస్తున్నామని గిరిజనులు తెలిపారు. గంజాయి సాగు అక్రమ రవాణా చేస్తున్న వారిలో చాలామంది గిరిజనులే ఉన్నారు. మే,ఏప్రిల్‌లో నెలలో ప్రభుత్వం వారు వచ్చి మాకు అవగాహన కల్పించాలన్నారు. తప్పని తెలిసినా మేం గంజాయి సాగు చేస్తున్నాం. మాజీవన ప్రమాణాలు పెంచుకో వడానికి వేరే మార్గాలు కనిపించడం లేదు. అందు వల్లనే మేం గంజాయి సాగు చేస్తున్నామని, గిరిజనులు అంటున్నారు.

గిరిజనుల మాటలు అలా ఉంటే మరో వైపు ప్రభుత్వం ఆపరేష్ పరివర్తన్‌ పేరిట ప్రభుత్వం గంజాయి తోటలను ధ్వంసం చేస్తుంది. మరోవైపు నక్సలైట్లు ఆపరేషన్‌ పరివర్తన్‌ తిప్పికొట్టాలని గిరిజనులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను చూపించ కుండా పంటలను ధ్వంసం చేయడం ఏంటని వారు ప్రశ్నిస్తూ వేసిన వాల్‌ పోస్టర్‌లు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. గంజాయి సాగుతో ప్రతి ఏటా మార్కెట్‌లోకి గంజాయి విపరీతంగా వస్తోంది. ఇప్పటికే ఈ సారి ఆపరేషన్‌ పరివర్తన్‌ పేరిట మొత్తం కాకపోయినా పంటలను ధ్వం సం చేయడం ద్వారా, ఎంతో కొంత గంజాయిని మార్కెట్లోకి రాకుండా అడ్డుకోవచ్చని ప్రభుత్వం చూస్తోంది. ఇదిలా ఉంటే, గిరిజ నులు ఈ గంజాయి సాగుతో అనేక చిక్కుల్లో పడుతున్నారు. దీన్ని పండించడం ఒక ఎత్తయితే మార్కెట్లోకి తీసుకురావడం, అక్రమ రవాణాచేస్తూ పోలీ సుల కంట పడుతూ కేసుల పాలవుతూ బలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గంజాయి సాగుపై గిరిజనులకు అవగాహన కల్పించి గంజాయి సాగు చేయకుండా చూడాల్సిన బాధ్యతతోపాటు వారికి ప్రత్యామ్నాయం కల్పించాల్సిన అవసరం ఉంది.

Exit mobile version