TDP Leader Buddha Venkanna Fired On Jagan over YS Viveka Case.
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఏపీలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ.. వివేకా హత్య ఎవరు చేశారో ప్రజలకు సీఎం జగన్ చెప్పాలని, మహిళా దినోత్సవం నాడు.. రోజా తిడుతుంటే జగన్ ముసి ముసి నవ్వులు నవ్వుతున్నారన్నారు. రోజా మాట్లాడితే విలువ ఉండదు.. ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు. సునీతమ్మను కేసులో ఇరికించేలా ప్లాన్ చేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. వివేకా హత్య జగన్‌కు తెలిసే జరిగిందని, అవినాష్ రెడ్డి ఎందుకు నోరు విప్పడం లేదన్నారు.
అవినాష్‌ను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేయడం లేదని, వివేకా హత్య కేసు పై కోర్టుకు వెళ్తామన్నారు. ఇలా మాట్లాడితే మాపై కేసులు పెట్టవచ్చు, దాడులు చేయొచ్చు.. ఎదుర్కోవడానికి మేము సిద్ధం అని ఆయన వెల్లడించారు. సునీత హైదరాబాదులో ఉంటుంది కనుక కేసీఆర్‌కు విన్నవిస్తున్నా.. ఆమె కుటుంబానికి కేసీఆర్ రక్షణ కల్పించాలన్నారు. పులివెందుల నుంచి బీటెక్ రవి పోటీ చేస్తారని చంద్రబాబు స్పష్టంగా చెప్పారని, సునీత ఎందుకు పోటీ చేస్తుందని, సునీత వెనుక టీడీపీ లేదని ఆయన స్పష్టం చేశారు. ఆమెపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
