NTV Telugu Site icon

పెళ్లి మండపం నుంచి పెళ్లి కూతురు జంప్..ఆ తర్వాత?

పెళ్ళి కాసేపట్లో.. మూడు ముళ్ళ బంధంతో ఏకం కావాల్సిన జంట… అనూహ్యంగా పెళ్ళికూతురు జంప్. ఆమె ఎక్కడికి వెళ్ళిందో టెన్షన్. పెళ్ళి మంటపం నుంచి వెళ్ళిపోయింది. సీన్ కట్ చేస్తే ప్రియుడితో కలిసి పోలీస్ స్టేషన్ కి వెళ్ళింది.

చిత్తూరు జిల్లా మదనపల్లి గ్రామీణ మండలం తట్టివారి పల్లికి చెందిన పల్లి రామకృష్ణ మల్లికల కుమార్తె సోనిక వివాహము పెద్దల నిశ్చయించిన నవీన్ కుమార్ తో 14 తేదీ ఆదివారం మదనపల్లి లోని సంఘం ఫంక్షన్ హాల్ లో జరగాల్సి ఉంది.అయితే తనకు ఈ పెళ్ళి ఇష్టం లేదంది. తాను ప్రేమించిన వ్యక్తిని కాదని మరో వ్యక్తితో వివాహం చేస్తున్నారని కళ్యాణ మండపం నుండి ఆదివారం తెల్లవారుజామున రెండున్నర గంటల ప్రాంతంలో పారిపోయింది. తను ప్రేమించిన చరణ్ తో వివాహము చేసుకొని జంటగా రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ కు చేరుకొని భద్రత కల్పించాలని పోలీసులని ఆశ్రయించారు.