NTV Telugu Site icon

BREAKING NEWS : ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. నారా లోకేష్ పై కోడి గుడ్ల దాడి..

Produtor

Produtor

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది..తెలుగు దేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్రలో లోకశ్ పై కోడిగుడ్డుతో దాడిచేశారు.. అయితే ఆ గుడ్డు లోకేష్ కు తగలకుండా పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బందికి తగిలాయి. దీంతో సెక్యూరిటీ అప్రమత్తం అయింది. ప్రొద్దుటూరు శివాలయం సెంటర్‌లో బహిరంగ సభ ముగించుకుని ఆర్టీసి బస్టాండ్ దాటి న తరువాత ఓ దుకాణం వద్ద ఆగి ప్రజలతో మాట్లాడుతుండగా గుడ్ల దాడి జరిగింది..

అయితే సెక్యూరిటీకి తగలడంతో వారు వెంటనే అప్రమత్తం అయ్యారు..ప్రొద్దుటూరులో లోకేష్ యువగళం సందర్భంగా పోలీసు సెక్యూరిటీ ఉన్నప్పటికీ దాడి జరగడంపై టిడిపి వర్గాలు పోలీసుల వైఫల్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. పోలీసులు న్యాయం వైపు కాకుండా వైసీపీకి కొమ్ముకాస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు.. ఈ సందర్భంగా పోలీసుల సెక్యూరిటీపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

లోకేశ్‌పై కోడిగుడ్డు వేసిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు అప్రమత్తం కావడంతో రిలయన్స్ పెట్రోల్ బంక్ నుంచి యువగళం పాద యాత్ర కొనసాగింది..ఆ సమయంలోనే ఇద్దరు యువకులు లోకేష్‌పై కోడిగుడ్లు, రాయి విసరడంతో టీడీపీ నేతలు అంతా షాకయ్యారు. యువకుల చర్యతో టీడీపీ కార్యకర్తలు కోపంతో ఊగిపోయారు. కోడిగుడ్లు విసిరిన వ్యక్తులను గుర్తించిన టీడీపీ కార్యకర్తలు.. వారిని వెంబడించి పట్టుకుని చితకబాదారు.. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ఎటువంటి గొడవలు జరగకుండా వారిని అదుపులోకి తీసుకున్నారు.. పోలీసుల తీరుపై లోకేష్ మండిపడ్డారు..ఇందుకు సంబందించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నాయి..